సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలి : బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: జిల్లాలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఘనంగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని గోదావరి నదితీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను శనివార డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఎసీపీ ప్రకాశ్​తో కలిసి పనులను పరిశీలించారు. 

అనంతరం మాట్లాడుతూ.. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, గద్దెల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు సహాయం కోసం వలంటీర్లను నియమించాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.