నస్పూర్, వెలుగు: ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి రెండు దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు టెక్నికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, పోలింగ్ కు వాడే ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సెంటర్లలో పురుషులు, మహిళలకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, గర్భిణులు, వృద్ధులు కోసం ప్రత్యేకంగా క్యూలైన్, దివ్యాంగుల కోసం అన్ని సెంటర్లలో రాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు సాయంత్రం నాలుగు గంటలలోపే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.