![Bade Miyan Chote Miyan Trailer: యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. బడే మియా చోటే మియా ట్రైలర్ డేట్ ఫిక్స్](https://static.v6velugu.com/uploads/2024/03/bade-miyan-chote-miyan-trailer-release-date-fix_sexbHKkMDv.jpg)
బాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan). అక్షయ్ కుమార్(Akshay kumar), టైగర్ ష్రాఫ్(Tiger shraf) కలిసి నటిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్(Ali Abbas jaffar) తెరకెక్కిస్తుండగా.. మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి బడే మియా చోటే మియా సినిమా కోసం యాక్షన్ లవర్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.