20 వేల మెజార్టీతో గెలుస్తా : బడే నాగజ్యోతి

తాడ్వాయి, వెలుగు : ములుగు నియోజకవర్గంలో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ బడే నాగజ్యోతి ధీమా వ్యక్తం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయిలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసే ప్రజలు గెలిపిస్తారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌‌చార్జి సాంబారి సమ్మారావు, ఎంపీపీ గొంది వాణిశ్రీ, మండల అధ్యక్షుడు దండుగల మల్లయ్య, ఆత్మ చైర్మన్‌‌ దుర్గం రమణయ్య, ట్రస్ట్‌‌ బోర్డు చైర్మన్‌‌ కొరనిబెల్లి శివయ్య, ఎంపీటీసీలు భవానీ నారాయణ, శ్రీనివాస్, సుమలత పాల్గొన్నారు. 

ఉమర్‌‌ఖాన్‌‌ భూములకు పట్టాలిస్తాం

ములుగు, వెలుగు :  ములుగు మండలం రాంచంద్రాపూర్‌‌ రెవెన్యూ శివారులో ఏళ్ల తరబడి పెండింగ్‌‌లో ఉన్న ఉమర్‌‌ఖాన్‌‌ భూములకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పట్టాలు ఇస్తామని, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జడ్పీ చైర్‌‌పర్సన్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌బడే నాగజ్యోతి చెప్పారు. శుక్రవారం ములుగు, గోవిందరావుపేట మండలాల్లో రెడ్కో చైర్మన్‌‌ వై.సతీశ్‌‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ భూములకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లను దేవాదుల పైపులైన్‌‌ ద్వారా ప్రతీ ఎకరానికి అందజేస్తామన్నారు. పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే తర్వాత ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పందికుంట సర్పంచ్‌‌ విష్ణువర్ధన్‌‌రెడ్డి, ఎంపీటీసీ తుమ్మ జైపాల్, లాలు, భానుచందర్, రూప్‌‌సింగ్‌‌, తిరుపతి పాల్గొన్నారు.