కొత్తగూడ,వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు గంటలే కరెంట్ ఉంటుందని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు.మంగళవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీని రైతులు నిలదీయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు,అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ పాల్గొన్నారు.