భ్రూణ హత్యలకి పాల్పడితే కఠిన చర్యలు : బడే నాగజ్యోతి

ములుగు, వెలుగు :  భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జడ్పీ చైర్​ పర్సన్​ బడే నాగజ్యోతి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిషత్​ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్​ పర్సన్​  మాట్లాడారు. ఏటూరునాగారం ప్రాంతంలో లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.   వైరల్ జ్వరాలు, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని,  లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే  గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని  జిల్లా వైద్యాధికారికి సూచించారు.  

యాసంగిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.  వరిపంటకి రూ.50  అదనంగా  మద్దతు ధర అందించాలని  సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్​  పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.  సమావేశానికి   గైర్హాజరైన ఎక్సైజ్ శాఖ అధికారులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో  జడ్పీటీసీలు   రుద్రమాదేవి, తుమ్మల హరిబాబు, నామా కరంచంద్ గాంధీ, తల్లాడి పుష్పలత, పాయం రమణ, జడ్పీ కోఆప్షన్​ సభ్యుడు వలీయాబీ, రియాజ్ మీర్జా, ఎంపీపీలు సూడి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రజిత, జనగం సమ్మక్క, జడ్పీ డిప్యూటీ సీఈవో రమాదేవి, డీఎంహెచ్​వో డాక్టర్​ అప్పయ్య, డీఏవో విజయ చంద్ర, జిల్లా క్వాలిటీ అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.