ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో జరిగిన అభివృద్ధే బీఆర్ఎస్ను గెలిపిస్తుందని జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్ఎస్ఆర్హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ములుగు ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తాడ్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, సింగిల్ విండో డైరెక్టర్ పాలకుర్తి రజిత రవీందర్, కాటాపూర్ బీజేపీ నాయకుడు ముత్యాల సతీశ్తోపాలు పలువురు బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరోసారి అధికార పార్టీని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, తాడ్వాయి మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.