అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి : బడే నాగజ్యోతి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని ములుగు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ బడే నాగజ్యోతి చెప్పారు. వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి నాగజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కోరారు. 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీతక్క నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ల అమలు చేయని ఆరు గ్యారంటీలు ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సాంబారి సమ్మారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పోరిగ గోవిందనాయక్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు ఇనుగాల రమణారెడ్డి, రమా జగదీశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు  పాల్గొన్నారు.