సేవ చేయడానికే పోటీలో ఉన్న : బడే నాగజ్యోతి

ఏటూరునాగారం, వెలుగు : ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా బరిలో నిలిచానని ములుగు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడే నాగజ్యోతి చెప్పారు. గెలిపించి సాదుకుంటారో.. ఓడించి చంపుకుంటారో ప్రజల ఇష్టం అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి శనివారం ఏటూరునాగారం మండలంలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసి కోట్లు సంపాదించిన వారు ఇప్పటి నుంచే భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తన దగ్గర కోట్లు లేకున్నా ములుగు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సత్తా, బలగం ఉందన్నారు. కొండాయి బ్రిడ్జిని తిరిగి నిర్మించడంతో పాటు, వరదల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట కో ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వలియాబీ సలీం, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈసం రామ్మూర్తి, కాకా వెంకన్న ఉన్నారు.

జ్యోతక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి

వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా ఇంచర్ల ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అసెంబ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై మాట్లాడారు. నాగజ్యోతి విజయం కోసం ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోను ప్రతి గడపకు తీసుకుపోవాలని చెప్పారు.