హైదరాబాద్,వెలుగు: బడిబాట కార్యక్రమం రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 3 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామని విద్యా శాఖ ఇటీవల ప్రకటించింది. అయితే.. లోక్ సభ ఎన్నికల ఫలితాల లెక్కింపు, ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేయాలని అధికారులు భావించారు.
మరోపక్క బడిబాట కార్యక్రమాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు విద్యా శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్లో జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. దాన్ని మళ్లీ 3 నుంచి ఉంటుందని రెండోసారి ప్రకటించారు.
తాజాగా ఈ షెడ్యూల్ కూడా వాయిదా పడింది. ఒకటి, రెండు రోజుల్లోనే బడిబాట షెడ్యూల్ రిలీజ్ చేస్తామని అధికారులు వెల్లడించారు.