
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. పాఠశాలల రీ ఓపెన్ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నారు సీఎం, మంత్రులు. రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 19లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.