నాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ

మంగపేట , వెలుగు : ములుగు జిల్లా మంగపేట  మండలంలోని ప్రముఖ గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ నాగులమ్మ ( సుంకు పండుగ ) మినీ జాతర పోస్టర్ ను సోమవారం ఆలయ ధర్మకర్త బాడిశ రామకృష్ణ అవిష్కరించారు.  మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని  లక్ష్మీ నర్సాపూర్ గ్రామంలో రమేశ్​ అధ్యక్షతన ఆలయ పూజారులు, వడ్డేలతో మినీ జాతర పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

  జాతర మార్చి 26 నుంచి  29  వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన పూజారి బాడిశ నాగ రమేశ్​, నవీన్, ముగబోయిన శివ, సోడి శ్రీను, వడ్డెలు మడకం లక్ష్మయ్య, కుర్సంపుల్లయ్య, కట్టం సమ్మక్క పాల్గొన్నారు.