స్కూల్ చిన్నారులపై అత్యాచార కేసులో.. నిందితుడు ఎన్‌కౌంటర్

స్కూల్ చిన్నారులపై అత్యాచార కేసులో.. నిందితుడు ఎన్‌కౌంటర్

ఇద్దరు స్కూల్ విద్యార్థినీలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  జైలు నుంచి పోలీసుల వాహనంలో నిందితుడిని తరలిస్తుండగా.. అక్షయ్ షిండే పోలీసుల గన్ తీసుకొని వారిపై కాల్పులు జరిపాడు. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన సెప్టెంబర్ 23న మహారాష్ట్ర బద్లాపూర్‌లో సోమవారం జరిగింది. బద్లాపూర్‌ స్కూల్ లో క్లీనర్ గా పని చేసే అక్షయ్ షిండే ఆగస్ట్ 12న వాష్ రూంకు వెళ్లిన నాలుగు, ఐయిదు సంవత్సరాల ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. అక్షయ్ ను ఆగస్ట్ 17న పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ కేసు సంచలనం సృష్టించింది. స్థానిక పోలీసులు మొదట ఈ కేసును విచారించారు. అయితే పోలీసుల దర్యాప్తులో తీవ్రమైన లోపాలపై ప్రజల నిరసన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ కు ఈ కేసు అప్పగించింది. 

ALSO READ | చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా కూడా జైలుకే... సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ఈ ఘటనపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ స్కూల్ చైర్మన్, సెక్రటరీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరు ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం బాంబే హైకోర్టుకు హజరై వెళ్తున్నాడు. ఈక్రమంలో పోలీసుల దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని అక్షయ్ వారిపై కాల్పులు జరిపాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అక్షయ్ షిండే చనిపోయాడు.