నా కొడుకు అంత్యక్రియలకు స్థలం చూపించండి

నా కొడుకు అంత్యక్రియలకు స్థలం చూపించండి

మహారాష్ట్రలోని బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్ కౌంటర్లో చనిపోయిన నిందితుడు అక్షయ్ షిండే అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. ఓ వైపు అక్షయ్ షిండే శవాన్ని ఇక్కడి శ్మశాన వాటికలో పూడ్చిపెడితే అపవిత్రమవుతుందని..మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు వార్నింగ్ ఇస్తుంటే.. మరోవైపు  నా కొడుకు శవాన్ని పాతిపెట్టేందుకు ఆరడుగుల స్థలాన్ని చూపించండి.. అంటూ నిందితుడి తండ్రి కోర్టును ఆశ్రయించాడు. దీంతో  నిందితుడు అక్షయ్ షిండే అంత్యక్రియలు ఆగిపోయాయి. 

పోలీసుల ఎన్ కౌంటర్లో హతమైన బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి తండ్రి శుక్రవారం ( సెప్టెంబర్ 27, 2024) మరోసారి ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి అంత్యక్రియలకు భూమి కావాలని ఆశ్రయించారు. 

నిందితుడు ఎన్ కౌంటర్లో మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమపై తిరగబడ్డ నిందితుడిని ఆత్మరక్షణకోసమే కాల్చామని ఎన్ కౌంటర్ చేసిన ఇన్ స్పెక్టర్ సంజయ్ షిండే చెప్పడం.. మరోవైపు పాయింట్ బ్లాంక్  రేంజ్ లో ఎందుకు కాల్చాల్సిన అవసరం ఏంటని  బాంబే హైకోర్టు థానే పోలీసులను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. 

ఎన్ కౌంటర్ పై నిష్పక్ష పాతంగా దర్యాప్తు జరిపించాలని నిందితుడి కుటుంబం ఇదివరకే హైకోర్టును ఆశ్రయించింది. అయితే మరోసారి నిందితుడు షిండే తండ్రి కోర్టును ఆశ్రయించారు. తన కొడుకు శవాన్ని పాతిపెట్టేందుకు స్థలం ఇప్పించాలని  కోరారు. 

నిందితుడి శవం ఖననాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన వ్యతిరేకిస్తోంది.. 

బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు.. పోలీసుల ఎన్ కౌంటర్లో మృతిచెందిన అక్షయ్ షిండే మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయడాన్ని రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) తీవ్రంగా వ్యతరికిస్తోంది. 

నిందితుడి శవాన్ని ఖననం చేస్తే స్థానిక శ్మశాన వాటిక అపవిత్రం అవుతుందని వాదిస్తూ ఎంఎన్ సీ కాల్వా యూనిట్ ఖననానికి అనుమతిని నిరాకరించింది. దీంతో షిండే తండ్రి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 

ఎన్ కౌంటర్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని.. తదుపరి ఫోరెన్సిక్ పరీక్షల కోసం మృతదేహాన్ని తరువాత రోజుల్లో వెలికితీసేలా ఖననం చేయాలని షిండే తండ్రి కోర్టును అభ్యర్థించారు.