Badminton Asia Mixed Team Championships 2025 : క్వార్టర్ ఫైనల్లో ఇండియా

Badminton Asia Mixed Team Championships 2025 : క్వార్టర్ ఫైనల్లో ఇండియా

కింగ్‌‌డావో: ఆసియా బ్యాడ్మింటన్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా క్వార్టర్‌‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌–డి తొలి రౌండ్ మ్యాచ్‌‌లో ఇండియా 5–0తో మకావుపై ఘన విజయం సాధించింది. మొదటిదైన మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌ పోరులో  సతీశ్‌‌ కుమార్‌‌–ఆద్య వారియత్‌‌ 21–10, 21–19తో లోక్‌‌ చోంగ్ లియోంగ్‌‌–వెంగ్‌‌ చీ ఎంగ్‌‌పై నెగ్గి శుభారంభాన్నిచ్చారు. 

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో లక్ష్యసేన్‌‌ 21–16, 21–12తో పాంగ్‌‌ ఫోంగ్‌‌ పుయ్‌‌ను ఓడించగా, విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో మాళవిక బన్సోద్‌‌ 21–15, 21–9తో హవో వాయ్‌‌ చాన్‌‌పై నెగ్గింది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో చిరాగ్ షెట్టి–అర్జున్‌‌ 21–15, 21–19తో చిన్‌‌ పోన్‌‌ పాయ్‌‌–కోక్‌‌ వెన్‌‌ వోంగ్‌‌పై, విమెన్స్‌‌ డబుల్స్‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ  21–10, 21–15తో ఎంగ్‌‌ వెంగ్‌‌ చి–పాయ్‌‌ చి వాపై గెలవడంతో ఇండియా 5–0తో విజయం సాధించింది. గురువారం జరిగే రెండో  మ్యాచ్‌లో ఇండియా.. కొరియాతో తలపడుతుంది. ఇందులో నెగ్గిన జట్టు గ్రూప్‌‌ టాపర్‌‌గా నిలుస్తుంది.