UrvashiRautela: ఊర్వశీ రౌతేలా పేరుపై గుడి.. బద్రీనాథ్ పూజారులు విమర్శలు.. టీమ్‌ క్లారిటీ..

UrvashiRautela: ఊర్వశీ రౌతేలా పేరుపై గుడి.. బద్రీనాథ్ పూజారులు విమర్శలు.. టీమ్‌ క్లారిటీ..

బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో క్రేజీ సంపాదించుకొంది. అలాగే తరుచూ ఏదో వివాదంలో ఉండే ఊర్వశీ.. మరోసారి తన కామెంట్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవలే హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ పాల్గొంది. అక్కడ తాను మాట్లాడుతూ..‘నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి’ అని అన్నారు. ఇపుడీ ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత పెరుగుతోంది. 

ఆమె వ్యాఖ్యలు ఉత్తరాఖండ్‌ బద్రీనాథ్‌లోని పూజారులు మరియు స్థానికులను ఆగ్రహానికి గురి చేశాయి. అంతేకాకుండా తనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మతపరమైన అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఊర్వశీ మాట్లాడిన మాటలను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారంటూ ఆమె టీమ్ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘ఊర్వశీ ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో నిజంగానే ఆమె ఫొటోకు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ పలు కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి.  మీరు వాటిని చదవవచ్చు కూడా.

ఊర్వశి రౌతేలా ప్రకటనపై గందరగోళ వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ఏ వ్యక్తిపైనా నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. ప్రతిఒక్కరినీ గౌరవించాలి. వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి’’ అని ఊర్వశీ టీమ్ పోస్టులో వెల్లడించింది. 

ఇకపోతే, ఊర్వశీ వాఖ్యలపైనా బద్రీనాథ్ ధామ్ మాజీ మత అధికారి భువాన్ చంద్ర ఉనియల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. " ఊర్వశి ప్రకటనలు తప్పుదారి పట్టించేవి అని అన్నారు. ఈ ఆలయం వాస్తవానికి హిందూ పురాణాల నుండి ఊర్వశి దేవికి అంకితం చేయబడిందని మరియు 108 శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆమె ఆలయం కాదు. ఇటువంటి ప్రకటనలు ఆమోదయోగ్యం కాదు. అలాంటి వాదనలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఉనియల్ అన్నారు.

ఇకపోతే, ఊర్వశీ రౌతేలా 2012లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది. ఆతర్వాత వరుస హిందీ సినిమాలలలో నటించింది.

రీసెంట్గా తెలుగులో బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, డాకు మహారాజ్ వంటి మూవీస్ లో హైటెమ్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది. ఊర్వశీ రౌతేలా రీసెంట్గా తెలుగులో బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, డాకు మహారాజ్ వంటి మూవీస్లో హైటెమ్ సాంగ్స్తో బాగా ఫేమస్ అయింది.