హుజూర్ నగర్ , వెలుగు: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పేకాట క్లబ్బులు తీసుకొస్తారని రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్య యాదవ్ విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర గిరిజన నాయకుడు రమణ నాయక్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఉత్తమ్ కు 50 వేల ఓట్లు మాత్రమే వేసి నియోజకవర్గం నుంచి శాశ్వతంగా పంపించాలని పిలుపునిచ్చారు.
ALSO READ : కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్రు: డీకే అరుణ
మ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గాన్ని రూ 4 వేల కోట్లతో అభివృద్ధి చేశారని , అసెంబ్లీ ఎన్నికల్లో 51 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వేముల శేఖర్ రెడ్డి , ముస్కుల చంద్రారెడ్డి, గంథం సతీష్ ,మంద వెంకటేశ్వర్లు, చిత్తలూరు సోమయ్య, అబ్బాస్ , పిల్లి మరియాదాస్, ముసంగి శ్రీను, పులి నర్సింహ, గండు శ్రీను తదితరులు ఉన్నారు.