ఏపీ సీఎం జగన్ రికార్డును బ్రేక్ చేసిన డాక్టర్ సుధ

ఏపీ సీఎం జగన్ రికార్డును బ్రేక్ చేసిన డాక్టర్ సుధ
  • గత ఎన్నికల్లో జగన్ కు 90,110 ఓట్ల మెజారిటీ
  • డాక్టర్ సుధకు 90,550 ఓట్ల మెజారిటీ
  • జగన్ కంటే డాక్టర్ సుధకు మెజారిటీ 440 ఓట్లు ఎక్కువ

కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. గత సాధారణ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిన భారీ మెజార్టీ రికార్డ్‌ను బద్దలు కొట్టారు. ఇదే జిల్లాలోని పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈ రికార్డ్‌ను ఇదే జిల్లాకు చెందిన బద్వేలు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బ్రేక్ చేశారు. జగన్ కంటే డాక్టర్ సుధకు 440 ఓట్ల మెజారిటీ ఎక్కువగా వచ్చింది.  వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు రాగా.. బీజేపీకి 21,678 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,235ఓట్లు, నోటాకు  3635 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద వైసీపీ అభ్యర్థి 90,550 ఓట్ల (76.25శాతం) భారీ మెజార్టీతో చారిత్రక విజయం సాధించడం విశేషం. ఏకగ్రీవం కావాల్సిన ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కారణంగా ఎన్నిక జరగడంతో  వైసీపీ పార్టీ సత్తా మరోసారి రుజువైందంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

రౌండ్ల వారీగా పార్టీలకు పోలైన ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి

రౌండ్లు          వైసీపీ        బీజేపీ         కాంగ్రెస్
1 రౌండ్        10,478        1688        580
2వ రౌండ్        10,570        2270        634
3వ రౌండ్        10,184        2305        598
4వ రౌండ్        9,867        2241        491
5వ రౌండ్        11,783        17971        575
6వ రౌండ్        11,383        1940        531
7వ రౌండ్        10,726        1924        841
8వ రౌండ్         9,691        1964        774
9వ రౌండ్        11,354        2839        493
10వ రౌండ్        10052        1554        449
11వ రౌండ్        5,139         984        223
12వ రౌండ్           483            54          14
13వ రౌండ్             362            40          12