ముషీరాబాద్, వెలుగు : ప్రశాంతమైన శారీరక, మానసికోల్లాసానికి సాంస్కృతిక, క్రీడా పోటీలు ఎంతో అవసరమని కాకా బీఆర్ అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్లు అన్నారు. శనివారం బాగ్ లింగంపల్లి కాకా బీఆర్ అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్‌లో పాఠశాల వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్యారమ్స్, చెస్ లాంటి క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ ను కనబరిచారు. బాలికలు కూడా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.