Bagheera: కొత్త ప్రాజెక్ట్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్

Bagheera: కొత్త ప్రాజెక్ట్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్

‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఏ ప్రాజెక్టు చేసినా వాటిపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్ కథతో.. హోంబలే ఫిల్మ్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ఓ సినిమా రూపొందుతోంది. ‘భగీర’(Bagheera) పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీలో ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. సూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టైటిల్, ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా భగీర మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేక‌ర్స్. ఈ సినిమాను 2024 అక్టోబ‌ర్ 31 వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి పోస్ట‌ర్‌ను పంచుకోగా అంచనాలు మొదలయ్యాయి. 

Also read:-కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ

ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్ లో రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపించి ఆకట్టుకున్నాడు శ్రీమురళి. అందులో పోలీస్ గెటప్ ఒకటి.  ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే విజువల్స్ కనిపిస్తున్నాయి. రుక్మిణీ వసంత్, ప్రకాష్ రాజ్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌‌నాథ్  సంగీతం అందిస్తున్నాడు.