న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బాఘెల్ కింగ్ పిన్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. స్కామ్ ద్వారా ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని తన ఖజానాను నింపుకోవడంతో పాటు కొంత భాగాన్ని గాంధీ కుటుంబానికీ పంపాడని ఆరోపించారు.
సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ యాప్ ప్రమోటర్లు బాఘెల్‌కు సుమారు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఇటీవల ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి మోసాలకు పాల్పడకుండా బాఘెల్‌పై చర్యలు తీసుకుంటామని భాటియా చెప్పారు. చత్తీస్‌గఢ్‌ను దోచుకోవడానికి బాఘెల్‌కు కాంగ్రెస్ అధిష్టానం పొడిగింపు ఇచ్చిందని ఆయన ఆరోపించారు.
ALSO READ : బీఆర్‌ఎస్‌లోకి తుల ఉమ, స్రవంతి