- బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ డిమాండ్
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు 2021 పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-(బీఎల్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్ లో కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనమాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీ బకాయిలను చెల్లించని విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
మున్సిపల్ ఔట్ సోర్సింగ్కార్మికులు శ్రమ దోపిడికీ గురవుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం రూ .26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఎల్టీయూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఆర్మూర్ మున్సిపల్ అధ్యక్షులు సీహెచ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాండు, బి.రాజన్న, అక్షయ్, యాదగిరి, చెరుకు గంగు, సుశీల, లక్ష్మీ పాల్గొన్నారు.