కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి బహుజన పరివర్తన ర్యాలీ నిర్వహించారు. వీక్లి మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్రోడ్డు, రైల్వే కమాన్, నిజాంసాగర్ ఛౌరస్తా, కొత్త బస్టాండుల మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు సాగింది.
ఇక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతినిధులు కొంగల వెంకటి, ఆకుల బాబు, కొత్తపల్లి మల్లయ్య, గంగయ్య, రాజలింగంతో పాటు అంబేడ్కర్ సంఘం, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.