
- ఊరూరా బీఎస్పీ జెండా పండుగలు
శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, తొండుపల్లి 10వ వార్డులో బహుజన్ సమాజ్ పార్టీ జెండా దిమ్మెల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల జయసింహ, బీఎస్పీకేవీ జిల్లా అధ్యక్షుడు మల్లగళ్ల యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాచమల్ల జయసింహ జెండా ఆవిష్కరించి, బహుజన సమాజ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఏనుగు గుర్తు ప్రభావం చాలా ఉంటుందన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పిస్తే వచ్చే రోజుల్లో ఏనుగు గుర్తుకి ఎదురు ఉండన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు యాపచెట్టు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కొమ్మూరి యాదయ్య, ఉపాధ్యక్షుడు రాచమల్ల రాజ్ కుమార్, సెక్రటరీలు ఆదిరాల రవికుమార్, హిమాయత్ సాగర్ సాయి కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ రాచమల్ల రవీందర్, శంషాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు చిన్నగండు భాస్కర్, ఉపాధ్యక్షుడు చింతమోని రమేశ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.