రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీని ఆనంద్ పర్యవేక్షిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో మాయవతి పార్టీ బాధ్యతలు నిర్వహించనుంది. 

లక్నోలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన రాజకీయ వారసుడిగా ఆకాస్ ఆనంద్ ను పేరును ప్రకటించింది. 
ఆకాష్ ఆనంద్ గురించి.. 

ఆకాష్ మాయావతి సోదరుడైన ఆనంద్ కుమార్ కుమారుడు. లండన్ లండన్ లో ఎంబీయే గ్రాడ్యుయేట్ చేసిన ఆకాష్ ను 2017లో పార్టీ కార్యకర్తలకు పరిచయం చేసింది. 2019లో లోక్ సభ ఎన్నికల్లో అతను బీఎస్పీ చీఫ్ ఎన్నికల ప్రచారం వ్యూహాన్ని నిర్వహించాడు. 

2022లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతను ప్రచారం సమయంలో పార్టీ సోషల్ మీడియాను నిర్వహించాడు. 2022లో  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. వచ్చే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు.