![బీసీ జనాభా లెక్కలపై అనుమానాలున్నయ్..ప్రభుత్వం సమగ్ర సమాచారాన్ని ప్రకటించాలి : దండి వెంకట్](https://static.v6velugu.com/uploads/2025/02/bahujana-left-party-demands-clarity-on-bc-census-seeks-all-party-meeting_MePsxO4dK5.jpg)
- బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ జనాభా లెక్కలపై అనుమానాలు ఉన్నాయని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. సమగ్ర కులగణన పూర్తి వివరాలను ప్రకటించాలని డిమాండ్చేశారు. నల్లకుంటలోని బీఎల్ఎఫ్ స్టేట్ఆఫీసులో బుధవారం పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ.. బీసీ మేధావులు, ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కులగణనపై అనుమానాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కులగణన సర్వేపై చర్చించకుండా.. బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు తమ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ గెజిట్ విడుదల చేసే ముందు మాదిగ, మాల ఉప కులాల మేధావులతో చర్చించాలని సీఎంను కోరారు.