భోపాల్ పాలిటిక్స్ .. 400 కార్లు.. 300 కిలోమీటర్లు ర్యాలీగా వెలితే..

భోపాల్ పాలిటిక్స్ .. 400 కార్లు.. 300 కిలోమీటర్లు ర్యాలీగా వెలితే..

మధ్యప్రదేశ్లో 300 కిలో మీటర్ల దూరాన్ని 400 కార్ల కాన్వాయ్తో చేరుకున్నాడో రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చేరికను ఘనంగా చాటుకోవాలని నిశ్చయించుకున్న  బీజేపీ లీడర్.. శివపురి నుండి భోపాల్ వరకు దాదాపు 300 కిలో మీటర్ల  దూరాన్ని... 400 కార్లతో ర్యాలీగా వెళ్లారు.  ప్రస్తుతం ఈ కాన్వాయ్ వీడియో వైరల్ అయింది. 

ఎవరీ లీడర్..

మధ్యప్రదేశ్లో 2020లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి బయటకు వచ్చాడు. ఈ సమయంలో  శివపురి రాజకీయ నాయకుడైన బైజ్ నాథ్ సింగ్.. జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. జ్యోతిరాధిత్య సిందియాతో చేతులు కలిపి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి,..బీజేపీని  అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ  తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సింధియా ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.

టికెట్ నిరాకరణ..తిరిగి కాంగ్రెస్ గూటికి..

ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో బీజేపీ టికెట్ కోసం బైజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు ఎమ్మెల్యే  టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్లో తన చేరికను ఘనంగా చాటాలనుకున్న బైజ్ నాథ్ సింగ్..శివపురి నుండి భోపాల్కు 400 కార్లతో చేరుకున్నారు. అనంతరం భోపాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్‌ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బైజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీకి చెందిన 15 మంది జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 

బాలీవుడ్ సినిమాతో పోలిక..

మధ్యప్రదేశ్ లోని శివపురి నుండి భోపాల్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి 400 కార్ల కాన్వాయ్ తో వెళ్లిన సమయంలో బైజ్ నాథ్ సింగ్.. కార్లు సైరన్‌లు మోగించుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో కొద్ది మంది  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన  నెటిజన్లు.. ఈ కాన్వాయ్లోని ఎన్వీయూలను బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రం సింఘమ్‌లోని సీన్లతో పోల్చారు.

సైరెన్లపై అభ్యంతరం..

బైజ్ నాథ్ సింగ్ 400 కార్ల కాన్వాయ్ లో సైరన్‌లు మోగించడాన్ని కొంద మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం.., అత్యవసర సేవలను అందించే వాహనాలు మాత్రమే రోడ్డుపై సైరన్‌లను మోగించాలని.... వీటిలో అంబులెన్స్‌లు, అగ్నిమాపక దళం, పోలీసుల వాహనాలు ఉన్నాయని తెలిపారు. కానీ రాజకీయ నాయకుడైన బైజ్ నాథ్ సింగ్ తన బలప్రదర్శన కోసం సైరన్లు మోగించడం ఏంటని ప్రశ్నించారు.