డేరాబాబాకు బెయిల్​ 21 రోజులు మంజూరు చేసిన కోర్టు

డేరాబాబాకు బెయిల్​ 21 రోజులు మంజూరు చేసిన కోర్టు

చండీగఢ్: ఇద్దరు మహిళలపై రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటికొచ్చారు. 21 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు కావడంతో డేరా బాబాను హర్యానాలోని సునారియా జైలు నుంచి మంగళవారం ఉదయం రిలీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

 బెయిల్ పీరియడ్​లో ఆయన ఉత్తరప్రదేశ్​లోని బర్నవాలో ఉన్న డేరా ఆశ్రమంలో బస చేస్తారని ఆయన అనుచరులు మీడియాకు వెల్లడించారు. తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. 16 ఏండ్ల కింద ఓ జర్నలిస్టు హత్య కేసులోనూ డేరా బాబాతో సహా మరో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. అయితే, రకరకాల కారణాలతో గడిచిన రెండేండ్లలో ఈయన ఏడుసార్లు పెరోల్​మీద బయటికొచ్చారు. నాలుగేండ్లలో మొత్తం 9 సార్లు బయటికివచ్చారు.