లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీకు ఇవాళ గురువారం (అక్టోబర్ 24న) బెయిల్ మంజూరు అయింది.
గత రెండు వారాలుగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ.. బెయిల్ కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా న్యాయస్థానం నిరాకరించింది తెలిసిందే. తాజాగా మరోసారి తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
అయితే ఆయనకు ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో బెయిల్ రావడం కష్టమయిందని న్యాయవాదులు తెలిపారు. మొత్తం మీద చివరకు జానీకు బెయిల్ లభించడంతో ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తర కొరియోగ్రాఫర్‌గా జానీ ఎంపిక అయ్యారు. ఈ నెల అక్టోబర్ 8న ఆయన పురస్కారం అందుకోవాల్సి ఉంది. దీంతో ఈ నెల 6 నుంచి 9 వరకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే.. ఆయనపై అభియోగాలు రావడంతో ఆయనకు ప్రకటించిన అవార్డును రద్దు చేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది.