ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు కొట్టివేత

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు గురువారం కొట్టేసింది. కోర్టులో దాఖలు చేసిన చార్జ్​షీట్ లో లోపాలు ఉండటంతో తమకు డిఫాల్ట్‌‌ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు.

అయితే, చార్జ్​షీట్​ను సరిచేసి ఇప్పటికే కోర్టుకు అందించినట్లు పోలీసుల తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్‌‌‌‌ రావు, శ్రవణ్‌‌ కుమార్‌‌‌‌ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు కీలకదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్టు ప్రకటించారు.