బైరామల్ గూడ రెండవ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్

ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్ బీ నగర్ ఏరియాలో నిర్మించిన ప్రాజెక్టులకు రూ.448 కోట్లు, భూసేకరణ రూ.210 కోట్లు మొత్తం రూ.658 కోట్ల ఖర్చుతో నాలుగు జంక్షన్లలో మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.148.05 కోట్లతో బైరామల్ గూడ జంక్షన్ నిర్మించిన 2వ ఫ్లైఓవర్ ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలతోపాటుగా  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సిటీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా పాల్గొన్నారు.

ALSO READ :- పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఏప్రిల్ 30 నాటికి ఐటీ రిటర్న్..

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదారాబాద్ కు ORR కట్టింది, మంచి నీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసేందుకు మా ప్రభుత్వ కృషి చేస్తుందని తెలిపారు. ఇటీవలనే అల్వాల్ లో ఎలివేటెడ్ కారిడార్ కు శుంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. రాబోయే కాలంలో దీర్ఘకాలిక అవసరాలు దృష్టి లో పెట్టుకొని హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు.