బజాజ్ ఎలియాంజ్ జీఐఈఏ అవార్డులు

బజాజ్ ఎలియాంజ్ జీఐఈఏ అవార్డులు

హైదరాబాద్​, వెలుగు: బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆసియా ఇన్సూరెన్స్ రివ్యూ భాగస్వామ్యంతో గ్లోబల్ ఇన్సూరెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (జీఐఈఏ) ను ప్రకటించింది. జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సలహాదారుల కృషిని గుర్తించి గౌరవించడం ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. ఈ అవార్డులను నిర్వహించడానికి బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆసియా ఇన్సూరెన్స్ రివ్యూతో జతకట్టింది.

భారతదేశంతో సహా ఆసియా, మధ్యప్రాచ్యం,  ఉత్తర ఆఫ్రికా (ఎంఈఎన్​ఏ) అంతటా ఉన్న బీమా సలహాదారులకు ఈ అవార్డులు గుర్తిస్తాయి.  హెల్త్ ఇన్సూరెన్స్ సలహాదారులు, మోటార్ ఇన్సూరెన్స్ సలహాదారులు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సలహాదారులు, మల్టీలైన్ ఇన్సూరెన్స్ సలహాదారుల వంటి అవార్డు కేటగిరీలు ఉన్నాయి. నామినేషన్ గడువు 19 ఫిబ్రవరి 2025 న ప్రారంభమై 20 మార్చి 2025 న ముగుస్తుంది.