బజాజ్​ సీఎన్జీ బైక్.. ఫ్రీడమ్​125

బజాజ్​ సీఎన్జీ బైక్.. ఫ్రీడమ్​125

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్‌‌‌‌‌‌‌‌ సైకిల్ -‘ఫ్రీడమ్​ 125’ని ----బజాజ్ ఆటో  రూ. 95వేల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరకు విడుదల చేసింది. మొదటి దశలో ఇది మహారాష్ట్ర,  గుజరాత్‌‌‌‌‌‌‌‌లలో అందుబాటులో ఉంటుంది. తదనంతరం ఇతర నగరాల్లో అమ్ముతారు.  పూణేలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఆవిష్కరించారు. ఇందులో సీఎన్​జీతోపాటు పెట్రోల్​ ట్యాంక్​ ఉంటుంది. కిలో సీఎన్​జీకి ఇది 102 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.