చేతక్ ఎలక్ట్రానిక్ స్కూటర్ సిరీస్‌లో బజాజ్ ఆటో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసింది. ‘35’ సిరీస్ స్కూటర్లు మూడు వేరియంట్లలో లభిస్తాయి. ధరలు రూ.1.20 లక్షల నుంచి మొదలవుతాయి. 3501 మోడల్ డెలివరీలు ఈ నెలే ప్రారంభమవుతాయి.
ఫుల్ నావిగేషన్ స్క్రీన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజీ, మ్యూజిక్ ప్లేయర్, బ్లూటూత్, స్పీడ్‌లాక్ వంటి ప్రత్యేకతలు ఈ స్కూటర్ల సొంతం. సింగిల్ చార్జ్‌తో 153 కిలోమీటర్లు వెళ్లొచ్చు.