నెదర్లాండ్‌ సబ్సిడరీలో బజాజ్ ఆటో రూ.1,364 కోట్ల పెట్టుబడి

నెదర్లాండ్‌ సబ్సిడరీలో బజాజ్ ఆటో రూ.1,364 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: నెదర్లాండ్‌లోని సబ్సిడరీ  కంపెనీ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌ బీవీలో రూ.1,364 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని బజాజ్ ఆటో ప్రకటించింది. ఈ సబ్సిడరీ   2023–24 లో రూ.19 కోట్ల టర్నోవర్ సాధించగా, రూ.5,488 కోట్ల వాల్యుయేషన్ పలుకుతోంది.  ఈ కంపెనీ ఇన్వెస్ట్​మెంట్‌ బిజినెస్‌లో ఉంది. 

బజాజ్ ఆటో  ఒకటి కంటే ఎక్కువ దశల్లో పెట్టుబడులు పెడుతుంది.   వచ్చే ఏడాది మార్చి 31 వరకు  పెట్టుబడులు పెడతామని  ప్రకటించింది. బజాజ్ ఆటో షేర్లు శుక్రవారం సెషన్‌లో 1.44 శాతం తగ్గి రూ.8,506 దగ్గర ముగిశాయి.