'పల్సర్..' ఈ పేరంటేనే కుర్రకారుకు మహా ఇష్టం. కుర్రోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ ఈ బైక్ ప్రియులే. ఏ ఊరికెళ్ళినా.. పదుల సంఖ్యలో ఈ బైకులే దర్శనమిస్తుంటాయి. కాకపోతే మరింత స్పోర్టీ లుక్ కావాలనుకునే కొందరు బైక్ ప్రియులు ఇతర బ్రాండ్లవైపు మొగ్గు చూపుతుంటారు. ఇకపై ఆ బెంగ కూడా అక్కర్లేదు. సరికొత్త స్పోర్టీ లుక్‌తో మరో కొత్త మోడల్‌ను బజాజ్ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
రూ. లక్షా 17వేలు
కుర్రకారు మదిని దోచేలా స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్150 మోడల్‌ను మార్కెట్ ఆవిష్కరించింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.1,17,677 లక్షలుగా నిర్ణయించింది. ఇంతకుముందు వచ్చిన పీ150 పల్సర్ మోడల్‌కు స్పోర్టీ లుక్ జోడించి బజాజ్ ఎన్150గా తీసుకొచ్చింది.
Also Read :- IT Raids: ఐ ఫోన్ డీలర్లపై IT రైడ్స్
45 నుంచి 50 మైలేజ్!
ఇక ఎన్150 ఫీచర్ల విషయానికొస్తే..149.68 సీసీ ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎఫ్1 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 14.30BHP విద్యుత్, 13.5NM టార్క్ వెలువరిస్తుంది. ఇక గేర్ బాక్స్ విషయానికొస్తే.. ఎప్పటిలానే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అన్నమాట. ఈ మోడల్ లీటర్ పెట్రోల్‌పై 45-50 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెప్తోంది.
గత మోడల్ ఎన్160తో పోలిస్తే ఎన్150 దాదాపు 7 కిలోలు బరువు తక్కువ. అలాగే, ఫ్యూయల్ ట్యాంక్‌పై యూఎస్‌బీ పోర్ట్ ఇస్తున్నారు. దీని ద్వారా మొబైల్స్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. రేసింగ్ రెడ్, మెటాలిక్ పెర్ల్ బైట్, ఎబోనీ బ్లాక్.. ఇలా మూడు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఎన్150 లుక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ బ్లూటూత్ కనెక్టవిటీ లేకపోవటం కొంచెం మైనస్ అని చెప్పొచ్చు.
Bajaj Pulsar N150: बाजार में लॉन्च हुई नई बजाज पल्सर N150 ये रही कीमत #BajajPulsarN150 pic.twitter.com/bMo8tVE9ou
— INH 24X7 (@inhnewsindia) September 27, 2023