బజాజ్ ఆటో లాభం పడింది.. రెండో త్రైమాసికంలో రూ. 1,385 కోట్ల గెయిన్

బజాజ్ ఆటో లాభం పడింది.. రెండో త్రైమాసికంలో రూ. 1,385 కోట్ల గెయిన్

న్యూఢిల్లీ: బజాజ్ ఆటో  సెప్టెంబరు 30, 2024తో ముగిసిన రెండవ క్వార్టర్​లో పన్ను తర్వాత లాభం (పీఏటీ)31 శాతం క్షీణించి 1,385 కోట్లకు పడిపోయింది.  గత ఆర్థిక సంవత్సరం జులై–-సెప్టెంబర్ కాలంలో కంపెనీ రూ. 2,020 కోట్ల పన్ను తర్వాత (నికరలాభం) ఏకీకృత లాభాన్ని ప్రకటించింది.  

అయితే రెండో క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 10,838 కోట్లతో పోలిస్తే రూ. 13,247 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్​ ప్రాతిపదికన, కంపెనీ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో 1,836 కోట్లు కాగా, ఈసారి 9 శాతం వృద్ధితో రూ.2,005 కోట్లకు చేరింది.