హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సేవల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులో తేవడానికి బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ఫలితంగా కస్టమర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్యాప్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ రిటైల్ ఫైనాన్షియల్ప్రొడక్టులను కొనుగోలు చేయవచ్చు.
తదనంతరం ఎయిర్టెల్ స్టోర్లలోనూ ఈ ప్రొడక్టులు అందుబాటులోకి వస్తాయి. ఎయిర్‌టెల్‌కు 37 కోట్ల మంది కస్టమర్లు, 12 లక్షల స్టోర్లు ఉన్నాయి. బజాజ్‌ఫైనాన్స్‌కు 27 ప్రొడక్ట్లైన్స్, ఐదు వేల బ్రాంచ్‌లు, 70 వేల మంది ఫీల్డ్ ఏజెంట్లు ఉన్నారు.