మరో 7 ఐపీఓలు..13 లిస్టింగ్‌‌‌‌లు

  • ఈ వారం రెండు మెయిన్‌‌‌‌ బోర్డ్ ఐపీఓలు ఓపెన్‌‌‌‌
  • మార్కెట్‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్

న్యూఢిల్లీ: ఇండియా ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్‌‌‌‌లో ఉంది.  మరో ఏడు కంపెనీలు ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.  13 కంపెనీలు లిస్టింగ్ కానున్నాయి. మెయిన్‌‌‌‌ బోర్డ్ ఐపీఓలు నార్తర్న్‌‌‌‌ ఆర్క్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌,  ఆర్కేడ్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌తో పాటు ఐదు ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు  ఈ వారం ఓపెన్ కానున్నాయి. నాన్‌‌‌‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నార్తర్న్‌‌‌‌  ఆర్క్ క్యాపిటల్ ఐపీఓ ఈ నెల 16 న ఓపెనై 19 న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.249–263 ప్రైస్‌‌‌‌లో అమ్మనున్నారు. ఈ చెన్నై బేస్డ్ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ  ఫ్రెష్‌‌‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.500 కోట్లు సేకరించనుంది.

 రూ.276 కోట్ల విలువైన 1.05 కోట్ల షేర్లను ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఫర్ సేల్ కింద షేర్ హోల్డర్లు అమ్మనున్నారు.  మరో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఆర్కేడ్ డెవలపర్స్‌‌‌‌ కూడా ఈ నెల 16 న ఓపెనై 19 న ముగుస్తుంది. ముంబైకి చెందిన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక్కో షేరుని రూ.121–128 ప్రైస్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో అమ్ముతోంది.  ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.410 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఈ నెల 13 న ఓపెనైన వెస్టర్న్‌‌‌‌ క్యారియర్స్ ఐపీఓ ఈ నెల 17 తో ముగుస్తుంది. ఈ కంపెనీ షేర్లు  రూ.163–172 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయి. 

ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు..

ఓసెల్‌‌‌‌ డివైజెస్‌‌‌‌, పెలట్రో ఐపీఓలు ఈ నెల 16–19 మధ్య ఓపెన్‌‌‌‌లో ఉండగా, ఎస్‌‌‌‌డీ  రిటైల్‌‌‌‌ ఐపీఓ ఈ నెల 20 న ఓపెనై 24 న ముగుస్తుంది.  పారామౌంట్‌‌‌‌ స్పెషాలిటీ ఫోర్జింగ్స్ ఐపీఓ ఈ నెల 17 న ఓపెనై 19 న, బైక్‌‌‌‌వో గ్రీన్‌‌‌‌టెక్‌‌‌‌ ఐపీఓ ఈ నెల 18 న ఓపెనై 20 న ముగుస్తాయి. ఓసెల్ డివైజెస్‌‌‌‌ షేర్లు రూ.155–160 ప్రైస్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో, ఎస్‌‌‌‌డీ రిటైల్ షేర్లు రూ.124–131 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. పెలట్రో షేర్లు రూ.190–200, పారామౌంట్‌‌‌‌ స్పెషాలిటీ షేర్లు రూ.57–59, బైక్‌‌‌‌వో గ్రీన్‌‌‌‌టెక్ షేర్లు రూ.59–62 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. 

లిస్టింగ్స్‌‌‌‌..

 నాలుగు మెయిన్‌‌‌‌ బోర్డ్‌‌‌‌తో సహా 13 కంపెనీలు ఈ వారం మార్కెట్‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. బజాజ్ హౌసింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, టొలిన్స్‌‌‌‌ టైర్స్‌‌‌‌, క్రోస్‌‌‌‌ షేర్లు  సోమవారం, పీఎన్‌‌‌‌ గాడ్గిల్‌‌‌‌ జ్యువెలర్స్‌‌‌‌ షేర్లు మంగళవారం మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కానున్నాయి.  ఎక్స్‌‌‌‌లెంట్ వైర్స్‌‌‌‌ అండ్ ప్యాకేజింగ్‌‌‌‌, సోధని అకాడమి ఆఫ్ ఫిన్‌‌‌‌టెక్స్‌‌‌‌ ఎనబులర్స్‌‌‌‌, ఇన్నోమెట్‌‌‌‌ అడ్వాన్స్డ్‌‌‌‌ మెటీరియల్స్‌‌‌‌, ఎస్‌‌‌‌పీపీ పాలిమర్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌సొల్‌‌‌‌ ఐటీఎస్‌‌‌‌ టెక్‌‌‌‌, ఆదిత్య అల్ట్రా స్టీల్‌‌‌‌, శుభశ్రీ బయోఫ్యూయల్స్‌‌‌‌ ఎనర్జీ, గజానంద్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌, షేర్ సామధాన్‌‌‌‌ షేర్లు ఈ వారం ఎస్‌‌‌‌ఎంఈ సెగ్మెంట్‌‌‌‌లో  లిస్టింగ్ కానున్నాయి.  

త్వరలో స్విగ్గీ ఐపీఓ..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ స్విగ్గీ ఈ వారం తన ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.8,300 కోట్లు సేకరించే ఆలోచనలో ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. స్విగ్గీలో సాఫ్ట్‌‌‌‌బ్యాంక్‌‌‌‌కు వాటాలున్నాయి. హ్యుందాయ్‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఎల్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్ ఇండియాలు కూడా త్వరలో తమ ఐపీఓ పేపర్లను ఫైల్ చేసే అవకాశం కనిపిస్తోంది.