
లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేసిన టొలిన్స్ టైర్స్, క్రోస్ లిమిటెడ్ షేర్లు
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు సోమవారం మార్కెట్‌లో బంపర్ బోణీ చేశాయి. ఐపీఓ ధర రూ. 70 తో పోలిస్తే 114 శాతం పెరిగి రూ.150 దగ్గర లిస్టింగ్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ర్యాలీ చేశాయి. కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 135 శాతం పెరిగి రూ. 165 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1.37 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.6,560 కోట్లను సేకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 63.60 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించిన విషయం తెలిసిందే.
టొలిన్స్ టైర్స్..
టొలిన్స్ టైర్స్ షేర్లు మార్కెట్‌లో ఫ్లాట్‌గా లిస్టింగ్ అయ్యాయి. ఐపీఓ ధర రూ.226 తో పోలిస్తే ఒక శాతం పెరిగి రూ.228 దగ్గర లిస్టింగ్ అయ్యాయి. ఆ తర్వాత 5.92 శాతం పెరిగి రూ.239.40 దగ్గర అప్పర్ సర్క్యూట్ టచ్ చేశాయి.
క్రాస్ లిమిటెడ్..
క్రాస్ లిమిటెడ్ షేర్లు సోమవారం మార్కెట్‌లో ఫ్లాట్‌గా లిస్టింగ్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.240 దగ్గరనే బోణీ చేశాయి. ఆ తర్వాత 11 శాతం పెరిగి రూ. 266 లెవెల్‌ను టచ్ చేశాయి.