స్టార్ట్స్ మోడల్ బైక్ కు ఏమాత్రం తీసిపోకుండా, మిడిల్ క్లాస్ బాయ్స్ బడ్జెట్ రేంజ్ లో ఓ సూపర్ బైక్ మార్కెట్ లోకి వచ్చింది. దాని ఫీచర్స్ వింటే ఎగిరి గంతేస్తారు. అయితే ఇప్పటి వరకు ఆటో మోబైల్స్ రంగంలో పెట్రోల్ లేదా డీజిల్ వెహికిల్స్, ఎలక్ట్రానిక్ వెహికిల్స్ చూశాం.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం బజాజ్ మోటర్స్ కంపెనీ ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ CNG తో నడిచే బైక్ అందుబాటులోకి తెచ్చింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీనే కాకుండా, ఈకో ఫ్రెండ్లీ కూడా.. ఇందులో పెట్రోల్, గ్యాస్ రెండూ రెండిటితో ఈ బజాబ్ బైక్ నడుస్తుంది. దాని పేరే బజాబ్ ప్రీడమ్ 125 CNG. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ CNG మోటర్‌సైకిల్ కంపెనీ తెలిపింది.
దీని లుక్స్ మాత్రం స్టన్నింగ్ అన్ని చెప్పొచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే అదుర్స్. దీనిలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 లీటర్స్ సీఎన్జీ గ్యాస్ ట్యాంక్ ఇచ్చారు. ఓ కేజీ గ్యాస్ తో 102 కిలోమిటర్లు నడుస్తుందని కంపెనీ చెప్తోంది. బెసిక్, మిడ్, టాప్ మూడు వేరియంట్లు, ఏడు కలర్స్ లో ఈ బైక్ లభిస్తుంది. ఎక్స్ షోరూం ప్రైజ్ వచ్చి బేస్ వేరియంట్ రూ.95వేలు, మిడ్ వేరియంట్ రూ.లక్షా 5వేలు, టాప్ వేరియంట్ లక్షా 10వేలు గా ఉంది. స్విచ్ కంట్రోల్ తో సీఎన్జీ, పెట్రోల్ మోడ్స్ ఛేంజ్ అవ్వొచ్చు. ఇతర 125 సీసీ ఇంజన్ బైక్ లతో పోల్చితే ఈ బైక్ ఐదు సంవత్సరాల్లో రూ.75వేలు ఫుయిల్ పై సేవ్ చేయవచ్చని కంపెనీ చెప్తోంది. దేశవ్యాప్తంగా కంపెనీ వెబ్ సైట్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని, డెలివరీలు కూడా చేస్తున్నామని బజాజ్ కంపెనీ ప్రకటించింది.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీసీ CNG బైక్ ఫీచర్స్
- ఫ్రెంట్ టెలిస్కోప్ ఫోక్స్, బ్యాక్ మోనోషాక్ షాక్ అబ్జర్స్ ప్రొవైడ్ చేశారు.
- ఎల్‌ఈడీ హెడ్ లైట్స్
- 5 స్పీడ్ గేర్ బాక్స్ తో 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్
- 9.5 హార్స్ పవర్ మరియు 9.7 Nm టార్క్
- ఫ్రెంట్ డిక్స్ బ్రేక్స్, వెనుక డ్రమ్ బ్రేక్స్
- బ్లూటుత్ కనెక్షన్