ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌

చెన్నై: రోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్సలు పొందేందుకు బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌తో కలిసి ఈఎంఐ హెల్త్‌‌కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అపోలో హాస్పిటల్‌‌ ప్రకటించింది. ఈ కార్డు ఉన్న వాళ్లు చికిత్సల ఖర్చును 12 సమాన వాయిదాల్లో చెల్లించవచ్చు. పెద్దగా పేపర్‌‌వర్క్‌‌ లేకుండానే త్వరగా లోన్‌‌ మంజూరు చేస్తామని బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌ తెలిపింది. హెల్త్‌‌కేర్‌‌, డయాగ్నస్టిక్‌‌ సేవలకు 100% లోన్‌‌ ఇవ్వడానికి గతంలోనూ ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. అత్యవసరంగా చికిత్సలు చేయించుకునేవారికి, వైద్యం ఖర్చును ఒకేసారి పెట్టలేని వారికి ఈఎంఐ హెల్త్‌‌కార్డు ఉపయోగపడుతుంది. మెడికల్‌‌ ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్‌‌ కవరేజీ తక్కువ ఉన్నా దీనిని వాడుకోవచ్చు. ఆర్‌‌బీఐ రూల్స్‌‌ ప్రకారం డాక్యుమెంట్స్‌‌ అందజేసిన వారికి కార్డు ఇస్తామని బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌ తెలిపింది.

టెలి క్లినిక్స్‌‌తో అపోలో టెలిహెల్త్‌‌ ఒప్పందం

మారుమూల ప్రాంతాల్లోని మలేసియావాసులకు టెలి మెడిసిన్ పద్ధతిలో చికిత్సలు అందించడానికి అపోలో గ్రూప్‌‌ అనుబంధ సంస్థ అపోలో టెలీహెల్త్‌‌ సర్వీసెస్‌‌ సిద్ధమయింది. మలేసియాకు చెందిన టెలి క్లినిక్స్‌‌తో ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 100 టెలిక్లినిక్స్‌‌ను ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎనిమిది క్లినిక్స్‌‌ వచ్చే నెల నుంచే మొదలవుతాయి. టెలిమెడిసిన్‌‌ పద్ధతిలో 2022 నాటికి 2.5 కోట్ల మందికి సేవలు అందిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది