స్పీడ్ లో ఉన్న క్రేజ్ ను ఎంజాయ్ చేయడానికి యువత ఉరకలు వేస్తోంది. తమకు నచ్చిన కంపెనీలో టాప్ స్పీడ్ లో వెళ్లే బైక్స్, హైఎస్ట్ సీసీ ఇంజన్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పల్సర్ NS 200 కుర్రకారుల చూపులను ఆకట్టుకుంది. ఆ మోడల్ బైక్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయ్.. అదే ఉత్సాహంతో బజాబ్ పల్సర్ NS 400Z మోడల్ ను ఆ కంపెనీ పరిచయం చేసింది. లుక్స్ పరంగా స్పోర్ట్ బైక్ లా ఎట్రాక్టివ్ గా ఉన్న ఈ బైక్ నాలుగు కలర్ వేరియంట్ లో మార్కెట్ లోకి రిలీజ్ కానుంది. మార్చి 3న కంపెనీ ఈ మోడల్ లాంచ్ చేసింది.
ఫీచర్స్ విషయానికొస్తే..
బజాజ్ పల్సర్ NS400Z లిక్విడ్-కూల్డ్, 373cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది.
8,800rpm, 40 హార్స్ పవర్, 6,500rpm వద్ద 35Nm టార్క్ ఉంటుంది.దీని టాప్ స్పీడ్ వచ్చి 154kph అని బజాజ్ కంపెనీ చెప్తోంది.
గేర్స్: 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్ తో స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ కూడా NS400Z లో అందిస్తుంది
సస్పెన్షన్: 43mm USD ఫోక్స్ మరియు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ గోల్డ్ కలర్ ఫోక్స్
బ్రేకింగ్: 4-పిస్టన్ గ్రిమెకా యాక్సియల్ కాలిపర్‌తో 320mm ఫ్రంట్ డిస్క్ మరియు 230mm బ్యాక్
బైక్ కొలతలు: 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ, NS400Z బరువు 174కిలోలు, ఇది డొమినార్ కంటే 19 కిలోలు తక్కువ. దీని సీట్ హైట్ 805mm
టైర్స్: 110/70-17 ఫ్రంట్, 140/70-17 బ్యాక్ టైర్లు ప్రొవైడ్ చేశారు.
లైటింగ్స్: ఎడ్జీ మెరుపు బోల్ట్-ఆకారపు DRL సెంట్రల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్,
4 రైడింగ్ మోడ్‌లు: స్పోర్ట్, రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్, 3 లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఆఫ్-రోడ్ రైడింగ్ మోడ్‌లో స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. ఈ రైడర్ ఎయిడ్స్ అన్నీ కలర్ LCD డాష్ బోర్డ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు.
డిజైన్: ఇందులో డిజిటల్ డిస్ ప్లే వస్తుంది. నావిగేషన్ డేటాను చూపే కుడివైపున ఉన్న చిన్న స్క్రీన్ మాత్రమే తేడా, రైడర్‌లను మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయవచ్చు. ల్యాప్ టైమర్ కూడా ఉంటుంది. స్విచ్ గేర్ కూడా కొత్తగా ఉంది, బ్రేక్, క్లచ్ లివర్లు అడ్జస్ చేసుకోవచ్చు. మొత్తం డిజైన్ చాలా ఎడ్జీగా ఉంటోంది.
ధర: అన్ని కలర్ వేరియంట్ల ఎక్స్ షోరూం ధర రూ.1.85 లక్షలుగా ఉంది. అన్ని బజాజ్ షోరూమ్‌లలో మరియు కంపెనీల వెబ్‌సైట్‌లో రూ. 5,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు ఉన్నాయి. పల్సర్ NS400Z జూన్ మొదటి వారంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.