కవిత అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు బీజేపీతో కలిసి సీఎం కుట్ర చేశారు : బాజిరెడ్డి గోవర్ధన్

కోరుట్ల,వెలుగు: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు బీజేపీతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కలిసి కుట్రపన్నారని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన పార్టీ పట్టణ, మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌పై బీఆర్ ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలను , కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో పసుపు బోర్డు  ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీతో ఎంపీ అర్వింద్ ప్రకటన చేయించి ఇప్పటివరకు ఏర్పాటుచేయలేదన్నారు. వ్యవసాయం , రైతుల సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ , బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగించాయన్నారు.

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి సీఎం రేవంత్ గెలిచారని, ఆయన ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అనలేదన్నారు. పార్టీలు మారే సీఎం రేవంత్ చివరికి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సీనియర్ లీడర్ నారాయణ రెడ్డి,  పట్టణ , మండల అధ్యక్షులు అనిల్, రాజేశ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ లావణ్య,  ఎంపీపీ నారాయణ, జడ్పీటీసీ లావణ్య, వైస్ ఎంపీపీ స్వరూప, వెంకట్రావ్ పాల్గొన్నారు.