నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మోపాల్, వెలుగు: మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ భరోసానిచ్చారు. మంచిప్ప అటవీ ప్రాంతంలో తరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న తమకు పోడు పట్టాలు అందలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మంచిప్పతండాకు చెందిన 100 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి విన్నవించాయి. బాజిరెడ్డి మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్​ఉన్నత లక్ష్యంతో ప్రాజెక్ట్​ను నిర్మిస్తున్నారని, కానీ ప్రభుత్వానికి మంచి రావొద్దనే ఉద్ధేశంతో ప్రతిపక్షాలు స్థానికులను రెచ్చగొడుతున్నాయన్నారు. నిర్వాసితుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. మంచిప్ప అటవీప్రాంతంలోని రాజులగుట్టలో సాగు చేసుకుంటున్న వారికి, రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు కావడంతో పట్టాలకు దూరమైన కాల్పోల్​గిరిజనులకు సైతం పోడు పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.