ప్రచారంలో బాజిరెడ్డి గోవర్దన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్టేషన్ లో నోరు జారుతున్నారు. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారు. ఓటర్ల దగ్గరికి వెళ్లి మర్యాదగా ఓట్లు అడాగాల్సింది పోయి  మాటలతో  దురుసుగా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మంచిప్ప గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం నిర్వహించారు. 

అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ఒక తల్లి తండ్రికి పుడితే రైతుబంధు, ప్రభుత్వ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కి  ఓటేయాలని పిలుపునిచ్చారు.  దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా  మంచిప్ప రిజర్వాయర్ ముంపు బాధితులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.  

తాజాగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు మరింత మండిపడుతున్నారు.  బాజిరెడ్డి గోవర్ధన్ క్షమాపణలు చెప్పాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.