హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజ రంగ్ దళ్ నాయకులు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వీహెచ్ పీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి పండరీనాథ్ ,బజరంగ్ దల్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు.. వినాయక ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకల అనంతరం హిందువులు అత్యధిక జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని అన్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 23న గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు నిర్వహించనున్న ఈ ర్యాలీలో సుమారు 3 లక్షల మంది హిందువులు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం హనుమాన్ జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని కోరారు.