రెజ్లర్ బజ్ రంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు 

రెజ్లర్ బజ్ రంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు 

న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ బజ్ రంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది.డోపింగ్ టెస్టుకు యూరినల్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాక రించినందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(NADA) బజ్ రంగ్ పునియాను సస్పెండ్ చేసింది. 

మార్చి 10న సోనెపట్ లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ లో పునియా మూత్ర నమూనాను నాడాకు ఇవ్వడానికి నిరాకరించడంతో తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. గురువారం (జూన్ 20) NADA నోటీసులు జారీ చేసింది. జూలై 11 లోపు సస్పెన్షన్ పై స్పందించాలని కోరింది. 

అయితే సస్పెన్షన్ పై పునియా స్పందిచాడు. తాను నమూనా ఇవ్వడానికి ఎప్పుడూ నిరాకరించలేదని స్పష్టం చేశాడు. శాంపిల్స్ సేకరించేందుకు నాడా పంపిన ఎక్స్ పెయిరీ డేట్ కిట్ గురించి అధికారుల స్పందించాలని కోరారు.