పెండింగ్‌‌‌‌ కేసులను 15 రోజుల్లో పరిష్కరించాలి :  బక్కి వెంకటయ్య

పెండింగ్‌‌‌‌ కేసులను 15 రోజుల్లో పరిష్కరించాలి :  బక్కి వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బక్కి వెంకటయ్య

హనుమకొండ, వెలుగు : ఎస్సీ, ఎస్టీ కేసులకు సత్వర పరిష్కారం చూపేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌‌‌‌ కేసులను 15 రోజుల్లో పరిష్కరించి రిపోర్ట్‌‌‌‌లు అందజేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, భూ సమస్యలపై సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను డీసీపీలు రవీందర్, సలీమా, ఏసీపీలు తిరుమల్, దేవేందర్‌‌‌‌రెడ్డి, తిరుపతి, కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌ వివరించారు.

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు భూ సమస్యలను చైర్మన్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ హసన్‌‌‌‌పర్తి మండలం మునిపల్లిలో దళితుల భూసమస్యకు సంబంధించిన నివేదికను వారం రోజుల్లో తమకు అందజేయాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

సమావేశంలో హనుమకొండ కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రెడ్డి, డీఆర్‌‌‌‌వో వైవీ.గణేశ్‌‌‌‌, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేశ్‌‌‌‌, డాక్టర్ నారాయణ, కమిషన్‌‌‌‌ సభ్యులు నునావత్‌‌‌‌ రాంబాబునాయక్‌‌‌‌, రేణికుంట్ల ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్, పుట్ట రవి, జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నాయక్‌‌‌‌, రడపాక పరంజ్యోతి, సింగారపు రవిప్రసాద్‌‌‌‌ పాల్గొన్నారు.