బక్రీద్ 2023.. 7 రుచికరమైన మటన్ వంటకాలు..తింటే అదుర్సే

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి.  బక్రీద్ పండుగ రోజు ముస్లింలు ఈద్‌గాలో నమాజు చేస్తారు.   ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి చేసుకుంటారు. .? ఆ తర్వాత  ఇంకేముంది.... విందులూ.. వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లతో కలిసి దావత్‌ చేసుకుంటారు. బక్రీద్ అంటే రుచుకరమైన మటన్ ఆధారిత వంటకాలకు పెట్టింది పేరు. ఈ ప్రత్యేకమైన రోజున ముస్లింలు   ఘుమఘుమలాడే మటన్ వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో  2023 బక్రీద్ సందర్భంగా బిర్యానీ, కబాబ్ లకు మించిన ఏడు రుచికరమైన మటన్ వంటకాలను మీకు పరిచయం చేస్తున్నాం.

బక్రీద్ 2023 7 రుచికరమైన వంటకాలు

మటన్ 65:

దేశంలో ముఖ్యంగా సౌతిండియాలో  మటన్ 65 అనేది ఒక ప్రత్యేకమైన వంటకం.  ఇది ఎలా తయారు చేసుకోవాలంటే..మటన్ ముక్కలకు గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గడ్డు, బియ్యం పిండి కలపాలి. ఇవి కలిపిన మటన్ ముక్కలను మంటపై కాల్చాలి. ఆ తర్వాత బాగా కాలిన తర్వాత వాటికి ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలతో వేడివేడిగా తింటే నా సామిరంగా..అదుర్స్ అనాల్సిందే. 

మటన్ సుక్కా:

మటన్ సుక్కా దీన్నే మటన్ ఫ్రై అని కూడా అంటారు. ఇది - ఆంధ్రప్రదేశ్‌లో ప్రియమైన వంటకం చెందిన . ఈ వంటకాన్ని స్టార్టర్‌గా కూడా ఆస్వాదించవచ్చు.  లేదా పరోటా, చపాతీతో కలిపి తినవచ్చు. ఆంధ్రా వంటకాలలో  మటన్ ఫ్రై అనేది ముఖ్యమైన వంటకంగా ఉంది. ఈ మటన్ ఫ్రైని బిర్యాని, లేదా అన్నంలో కలిపి తింటే ఖతర్నాక్ గా ఉంటుంది. 

దీన్ని ఎలా తయారు చేయాలంటే..

మటన్‌లో అన్ని మసాలా దినుసులను కలపండి. దాన్ని కనీసం 3 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ తర్వాత  కుక్కర్‌లో మటన్ ముక్కలను వేసి , 300 ml నీరు వేసి, మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత, ఓ  పాత్రలో నూనె వేడి చేసి కరివేపాకు, ఎర్ర మిరపకాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన మటన్ అందులో వేయాలి. నీరు ఆవిరైన తర్వాత 15 నిమిషాలలో ముక్కల నుండి నూనె వేరు చేయబడుతుంది. తరవాత బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కలకు పట్టే వరకు ఉడికించాలి. అనంతరం పచ్చి కొత్తిమీర వేస్తే అంతే. మటన్ ఫ్రై రెడీ. 

మటన్ పులావ్:

నాన్‌వెజ్ ప్రియులకు  మటన్ పులావ చాలా నచ్చుతుంది. దీన్ని  ఇంట్లోనే టేస్టీగా వండుకోవచ్చు. 

మటన్  పులావ్ తయారీ ఇలా 

మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.  అందులో పెరుగు, ఉప్పు వేసి ఒక గంట పాటు మారినేట్ చేయాలి.   స్టవ్ పై కడాయి పెట్టి మసాలా దినుసులు, గసగసాలు అన్ని వేసుకుని వేయించాలి. వాటిని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి.  కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె, నెయ్యి కలిపి వేయాలి.   సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  అవి బాగా వేగాక కొత్తిమీర, పుదీనా, కారం, ముందుగా మిక్సీలో చేసుకున్న మసాలా పొడి వేసి బాగా వేయించాలి.   అందులో మటన్ వేసి ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వరకు ఉడికిస్తే మటన్ మెత్తగా ఉడికుతుంది.  ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి.  అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మళ్ళీ విజిల్ పెట్టి రెండు విజిల్స్ వరకు స్టవ్ మీద ఉంచాలి. తరువాత మూత తీస్తే టేస్టీ మటన్ పులావ్ రెడీ. 

మిలిటరీ మటన్ కర్రీ..తయారీ విధానం

మిలటరీ మటన్ కర్రీకి కోసం  వెల్లుల్లి, అల్లం పేస్ట్ చేయాలి. దానిని పక్కన పెట్టి.. మరో మిక్సర్ జార్‌లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా చేసి.. దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ గిన్నే తీసుకుని దానిలో మటన్ వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అనంతరం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి.. గంటసేపు అలాగే ఉంచండి. ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో నూనె వేసి.. దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, బే ఆకులు, ఉల్లిపాయలను వేసి వేయించాలి. అవి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో మారినేట్ చేసిన మటన్ వేసి.... ఎక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు నీళ్లు పోసి ఉప్పు వేయాలి. దానిని ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి..  కొంచెం నెయ్యి వేస్తే మిలటరీ మటన్ కర్రీ సిద్ధమైనట్లే. 

ALSO READ:సైదాబాద్ హనుమాన్ దేవాలయ ప్రహరి కూల్చివేత..ఉద్రిక్తత

రారా మటన్:

రారా మటన్ అనేది హిమాచల్ ప్రదేశ్  మటన్ కర్రీ ప్రత్యేక వంటకం. 

రారా మటన్ రిసిపి తయారు చేసే విధానం..

హిమాచలీ మటన్ రారా కర్రీని కోసం వెడల్పాటి పాన్‌లో  జాజికాయ మినహా అన్ని గరం మసాలా పదార్థాలను వేయించి..వాటిని మిక్సీ పట్టాలి.  ఈ మిశ్రమంలో జాజికాయ పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనే పోసి జీలకర్ర,తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అల్లం పేస్ట్ వేయించాలి. ఆ తర్వాత  కారం, పసుపు వేసి బాగా కలపాలి. టమోటాలు, ఉప్పు,కొద్దిగా చక్కెర కూడా వేయాలి.  టమోటాలు మెత్తగా, నూనె పైకి వచ్చే వరకు మీడియం మంట మీద 15 నుండి 20 నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీరు పోసుకోవాలి.  ఇప్పుడు మటన్ మిక్స్ చేసి, 20 నుండి 25 నిమిషాలు ఉడికించాలి. రుచి  కోసం నెయ్యి వేయాలి. కొద్దిగా నీరు పోసుకుని 30 నుండి 45 నిమిషాలు ఉడికించాలి. చివర్లో  గరం మసాలా వేయాలి. అంతే నోరూరించే  హిమాచలీ మటన్ రారా  సర్వ్ చేసుకుని తినేయండి.